దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ

Related image

విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ
తేదీ.08-12-2023.

దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ

ప్రజల సంక్షేమం, అభివృధి ప్రధానo


పశ్చిమ నియోజకవర్గం 39,46,51 డివిజన్లలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్నికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సచివాలయంలో సంక్షేమం  బోర్డును ఆవిష్కరించి సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జండా దిమ్మను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగనన్న హయాంలో కులం మతం ప్రాంతం తేడా లేకుండా అభివృద్ది చేస్తున్నారన్నారు.ప్రతి పక్షాలకు కూడా సంక్షేం పథకాలు ఇస్తున్నాం అని తెలిపారు.ప్రతిదీ అభివృద్ది పరుస్తున్నం అని అన్నారు.ప్రజల అభిప్రాయాన్ని తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్తున్నాం అని తెలిపారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ మంచి చేశారని, ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రతి మంత్రి ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఉందని, దానికి ఉదాహరణ గడపగడపకు మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే, అను పలు కార్యక్రమాల వల్ల ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుందని, విజయవాడ నగరం దినదినాభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అయినా ప్రజల శ్రేయస్సు కోరుకునే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి  నిర్వహించారని ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి చివరి లబ్ధిదారులు కూడా అందేటట్టు  జరిగిందని తెలిపారు


తదుపరి విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం సాయంత్రం 46 వ డివిజన్ లో,143 సచివాలయం పరిధి లో కలరా హాస్పిటల్,  ABMUP స్కూల్ లో జరిగిన పెల్లెకు పోదాం కార్యక్రమం లో పాల్గున్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ విజయవాడ నగరం ఈరోజు ఇంత అభివృద్ధికి నోచుకుంది అంటే దానికి జగనన్న ప్రభుత్వమే కారణమని, ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందని అమలుపరచడమే కాకుండా ప్రతి లబ్ధిదారుకి లబ్ధి చేకూరేటట్టు చూస్తుందని అన్నారు. అంతే కాకుండా ప్రజల ప్రతి సమస్యలకు, ఖచితంగా పరిష్కారం దొరుకుతుంది అన్నారు.


పబ్లిక్ రిలేషన్స్ అధికారి
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ


More Press Releases