అందరికీ నచ్చేలా అన్ని అంశాలను జోడించి తీసిన చిత్రమే ‘అథర్వ’.. నిర్మాత సుభాష్ నూతలపాటి

Related image

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం  'అథర్వ'. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత సుభాష్ నూతలపాటి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

 ‘అథర్వ’ ప్రాజెక్ట్ మీ దగ్గరకు ఎలా వచ్చింది? జర్నీ ఎలా మొదలైంది? 
 మహేష్ రెడ్డి గారు నాకు కథను నెరేట్ చేసిన విధానం నచ్చింది. ఎంతో డీటైలింగ్‌గా అనిపించింది. క్లూస్ డిపార్ట్మెంట్ గురించి బాగా చెప్పారు. కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేశాం.

 మీకు సినిమా నేపథ్యం ఉందా? ఇంతకు ముందు ఏమైనా సినిమాలు నిర్మించారా? 

నేను యూకేలో ఎంబీఏ స్టూడెంట్‌ని. ఇండియాకు వచ్చినప్పుడు మా నాన్న గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. ఆయకు సపోర్ట్‌గా నిలిచాను. ఇంతకు ముందే వేరే బ్యానర్‌లో ఓ సినిమాను చేశాం. మాకు టెక్నికల్‌గా అథర్వ రెండో చిత్రం.
 
‘అథర్వ’లో ఏ మూమెంట్స్ బాగుంటాయి?.. మీకు నచ్చిన పాయింట్ ఏంటి? 
ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడుతున్నారు. ఇందులో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. వారు చేసే పనిని ఇందులో మరింత డీటైలింగ్‌గా చూపిస్తాం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది.

 క్లూస్ డిపార్ట్మెంట్ మీద సినిమా తీశారు. వారితో ఏమైనా కలిసి రీసెర్చ్ చేశారా? 
మా డైరెక్టర్ మహేష్ రెడ్డి బ్రదర్ క్లూస్ టీంలో పని చేస్తున్నారు. క్లూస్ టీం వెంకన్న గారితో మా డైరెక్టర్ ఆరు నెలలు కలిసి రీసెర్చ్ చేశారు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా రీసెర్చ్ చేశారు. క్లూస్ టీంకు ప్రివ్యూ వేస్తే వారంతా చాలా ఎమోషనల్ అయ్యారు. 

 ‘అథర్వ’లోకి కార్తీక్ రాజు ఎలా వచ్చారు ? ఆయన ఎలా నటించారు? 
ఇన్‌స్టాగ్రాం ద్వారా ప్రొఫైల్స్ వచ్చాయి. మా దర్శకుడికి నచ్చడంతో పాత్రకు సెట్ అవుతారని అనిపించడంతో తీసుకున్నారు. ఆయన ఎలా నటించారో ప్రేక్షకులే చెబుతారు.

 ‘అథర్వ’ను అనుకున్న బడ్జెట్‌లోనే తెరకెక్కించారా? 
ప్రతీ సినిమాకు బడ్జెట్‌ పెరుగుతూనే ఉంటుంది. అయితే సినిమాను మరింత బాగా తీయాలనే ఉద్దేశంతోనే ఖర్చు పెడతాం. ఈ సినిమా కోసం స్పెషల్ సెట్స్ వేశాం. వాటి గురించి ఇప్పుడే చెప్పలేం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

 ‘అథర్వ’లో ఇద్దరు హీరోయిన్లున్నారు? వారి పాత్రలు ఎలా ఉంటాయి? 

అథర్వలో ఇద్దరు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. కథలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతోనే పెట్టాం. ఒకరు క్రైమ్ రిపోర్టర్‌గా నటించారు. ఇంకొకరు సినిమాలో సినిమా హీరోయిన్‌గా నటించారు.

 ‘యానిమల్‌’తో పోటీగా వస్తున్నారు? ఆ ప్రభావం ఉండదని భావిస్తున్నారా? 
ప్రతీ వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. తరువాత నాని, ప్రభాస్ గార్ల సినిమాలున్నాయి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది. యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా మాకు ఇదే సరైన డేట్ అనిపించింది. 

 మీ ఫ్యామిలీ ఈ చిత్రాన్ని వీక్షించారా? వారికి ఏ పాయింట్స్ నచ్చాయి? 
అథర్వ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఒక్కొక్కొరికి ఒక్కో పాయింట్ నచ్చింది. ముఖ్యంగా ట్విస్టులు అందరినీ ఆకట్టుకున్నాయి.

 ‘అథర్వ’లాంటి చిత్రాలకు కెమెరా, ఆర్ఆర్, మ్యూజిక్ చాలా అవసరం. ఈ చిత్రంలో వాటి పార్ట్ ఎలా ఉండబోతోంది? 
చరణ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. శ్రీ చరణ్ పాకాల గారి మ్యూజిక్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగాయి. వినయ్, ఉద్దవ్ గారి ఎడిటింగ్ బాగుంటుంది.

       

More Press Releases