ఆసక్తి రేకెత్తించేలా ‘అథర్వ’ స్నీక్ పీక్.. సింగిల్ షాట్‌లో తీసిన మూడు నిమిషాల సన్నివేశం

ఆసక్తి రేకెత్తించేలా ‘అథర్వ’ స్నీక్ పీక్.. సింగిల్ షాట్‌లో తీసిన మూడు నిమిషాల సన్నివేశం
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం  'అథర్వ'. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా మీద మరింత ఆసక్తి కలిగించేలా స్నీక్ పీక్ అంటూ సింగిల్ షాట్‌‌లో తీసిన సీన్‌ను రిలీజ్ చేశారు.

ఈ స్నీక్ పీక్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురి వ్యక్తుల హత్య జరుగుతుంది. క్లూస్ టీం వచ్చి క్లూస్ కలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. ఈ క్లూస్ టీంలోనే హీరో హీరోయిన్లు ఉన్నారు. క్లూస్ ఎలా కలెక్ట్ చేస్తారో డీటైలింగ్‌గా చూపించారు. క్లూస్ కలెక్ట్ చేసే పనిలో టీం ఉంటే.. పోలీస్ వచ్చి తన డ్యూటీ తాను చేసుకుంటాడు. ఈ హత్యల గురించి సమాచారాన్ని మీడియాకు ఇస్తాడు. 

మూడు నిమిషాల పాటు ఉన్న ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం విశేషం. ఇక ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసింది ఎవరు? వీటి వెనకాల ఉన్నది ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా చూడాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే.

Karthik Raj
Simran Chowdhary
Atharva
Tollywood
Film News

More Press News