ఆరు వారాలైనా అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న రుహానీ శర్మ ‘Her - Chapter 1

Related image

థియేటర్, ఓటీటీ అంటూ ఆడియెన్స్ సపరేట్ అయ్యారు. కొన్ని చిత్రాలు థియేటర్లో బాగా ఆడుతుంటే.. ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా అన్ని చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her - Chapter 1 (హర్ చాప్టర్ 1) మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.

శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా నటించారు. ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ తన నటనతో ఆకట్టుకున్నారు. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడ్ని పోగొట్టుకున్న కేసుకి లింక్ ఉండటం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్చనకు ఎదురయ్యే సవాళ్లన్నీ కూడా ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటాయి.

ఇక రెండో పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ చాప్టర్ 1 ముగుస్తుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించిన శ్రీధర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ఇంటెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించిన రుహానీ శర్మ మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం

More Press Releases