సినిమాకు అందరూ కనెక్ట్ అవుతున్నారు.. ‘అలా నిన్ను చేరి’పై నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్

Related image

ఫీల్ గుడ్ లవ్ కాన్సెప్ట్‌తో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం  ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాశారు.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత సాయి సుధాకర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

 మొదటి సినిమాకే చాలా బడ్జెట్ పెట్టారు.. ఈ ప్రయాణంలో మీరేం నేర్చుకున్నారు? 
కథకు ఏం కావాలో అదే చేశాం. అంతే ఖర్చు పెట్టాం. ముందుగా మేం ఇన్ని పాటలు అనుకోలేదు. సాంగ్స్‌‌కు ఖర్చు పెట్టాం. విలెజ్‌లో అన్నీ రియల్ లొకేషన్స్ లోనే తెరకెక్కించాం. 

 సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? 
ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా విలేజ్ నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా కూడా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.

 సినిమా చూసిన తరువాత మీ నాన్న గారి రియాక్షన్ ఏంటి? 
ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా నాన్న గారు మాట్లాడారు. ఆల్రెడీ మా నాన్న ఈ చిత్రాన్ని చూశారు. ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరి జీవితాల్లోనూ కామన్‌గా ఉంటుంది. సినిమా చూసిన చాలా మంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందని అన్నారు. సినిమా బాగా తీశారని మా నాన్న మెచ్చుకున్నారు.

 సినిమాల్లోకి ఎందుకు రావాలని అనుకున్నారు? మీ నేపథ్యం ఏంటి? 
మా తాతగారు ఎప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్‌లో ఉండేవారు. మాకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. మేం సినిమాలు తీయాలని ఫిక్స్ అయినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను నిర్మించాం.

 ఈ చిత్రంలో మీరు చిన్న పాత్రను పోషించారు. ఆ అనుభవం ఎలా ఉంది? 
నాకు నటన మీద నాలెడ్జ్ అంతగా లేదు. కానీ నేను తెరపై బాగుంటాను అని అందరూ అంటుంటారు. అందుకే నన్ను నేను టెస్ట్ చేసుకునేందుకు ఓ చిన్న పాత్రను పోషించాను. మన ప్రొడక్షన్ కంపెనీయే కదా? అని ఏదో అలా ప్రయత్నించాను.

 డైరెక్టర్ మారేష్ గురించి చెప్పండి? 
డైరెక్టర్ మారేష్ శివన్ గారు మంచి కథను, డెప్త్ ఉన్న డైలాగ్స్‌ను రాసుకున్నారు. ఆయన రాసిన డైలాగ్స్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

 మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ పనితనం ఎలా ఉంది? 
అలా నిన్ను చేరి చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతమే ప్రధాన బలం. ఆయనకు చంద్రబోస్ గారి సాహిత్యం మరింత బలాన్ని ఇచ్చింది. కమర్షియల్ లవ్ సాంగ్స్ రాయాలంటే అది చంద్రబోస్ గారి వల్లే సాధ్యం అవుతుంది. అన్ని పాటలు ఆయనే రాయడం మా అదృష్టం. సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చే ఆరు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

 సినిమాటోగ్రఫర్ ఆండ్రూ గారి గురించి చెప్పండి? 
అలా నిన్ను చేరి టీం మెంబర్లలో చాలా వరకు కొత్తవారే. మాలాంటి కొత్త వాళ్లకు సీనియర్ కెమెరామెన్ ఆండ్రూ గారు దొరకడం అదృష్టం. ఆయన చాలా గొప్ప కెమెరామెన్. ఎన్నో గొప్ప సినిమాలను చేశారు. మా చిత్రానికి అందమైన విజువల్స్ అందించారు.

 తదుపరి చిత్రాన్ని కూడా ఇదే జానర్‌లో తీస్తారా? 
కథ, కాన్సెప్ట్ నచ్చితే ఏ జానర్‌లో అయినా సినిమా తీస్తాం. కథకు ఎవరు సెట్ అయితే వారిని అప్రోచ్ అవుతాం. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ఎంతో మంది వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తుంటాను. థ్రిల్లర్ జానర్‌లో ఓ కథను విన్నాను.


     

More Press Releases