ఫిబ్రవరి 2న బీజేపీ, జనసేన భారీ కవాతు!

ఫిబ్రవరి 2న బీజేపీ, జనసేన భారీ కవాతు!

ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధర్, ఎం.పి.జి.వి.ఎల్.నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. బి.జె.పి.లోని వివిధ స్థాయి నాయకులతో చర్చించిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

Janasena
Janasena Kavathu
Pawan Kalyan
Andhra Pradesh

More Press News