హైదరాబాద్ లో తొలిసారిగా ఆటిజం పై అవగాహన కార్యక్రమం

Related image

హైదరాబాద్, అక్టోబర్ 26, 2023: ఆటిజం, తలసేమియా, ట్రాన్స్‌జెండర్ల కోసం పనిచేస్తున్న మార్హం-రెసొనేటింగ్ రెసిలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ రోజు 'స్పెక్ట్రమ్ స్పార్కిల్' అనే పేరుతో మొట్టమొదటిసారిగా ఆటిజంపై అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఆటిజం రోగనిర్ధారణ, పిల్లల ఆలస్యమైన భావోద్వేగ అభివృద్ధి, సంపూర్ణ నిర్వహణపై లోతైన, అత్యంత కీలకమైన విషయాలను ఈ కార్యక్రమం అందించనుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్, సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ హెడ్, డాక్టర్ మిన్‌హజ్‌జాఫర్ నాసిరాబాడి, నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రొఫెసర్ డాక్టర్ టి. ఉషా రాణి, రోష్ని కౌన్సెలింగ్ సెంటర్  సైకాలజిస్ట్ డాక్టర్ జయంతి సుందర్ రాజన్, పాల్గొన్నారు. ఆటిజం అవగాహనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ - గుంజాయిష్ పోస్టర్‌ను  విడుదల చేశారు. మార్హం వ్యవస్థాపకులు డాక్టర్ నబత్ లఖానీ మాట్లాడుతూ అక్టోబర్ 29 శిల్ప కళా వేదికలో ‘స్పెక్ట్రమ్ స్పార్కిల్’ అనే  కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్పెక్ట్రమ్ స్పార్కిల్ అనేది రోగనిర్ధారణ, చికిత్సలు, సమగ్ర విద్య, ఉపాధి, భవిష్యత్తుపై ప్రత్యేక నిపుణుల ప్యానెల్ చర్చల సమ్మేళనం. ఆటిస్టిక్ ప్రతిభావంతులను,  వారి కుటుంబాలను అభినందిస్తూ తీసిన లఘు చిత్రం - గుంజాయిష్ ప్రదర్శన కూడా ఇందులో భాగం. ‘విద్య, వినోదం, ఆటిజం కమ్యూనిటీ లోని అద్భుతమైన ప్రతిభావంతుల వేడుకలను మిళితం చేసే ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ స్పెక్ట్రమ్‌లో పిల్లలతో ఉన్న కుటుంబాలకు సమాచారం, అవగాహన, మద్దతు అందించడం కోసం ఒక వేదికను అందించడం మా లక్ష్యం. ఆటిజంతో బాధితుల ప్రత్యేక సామర్ధ్యాలు, వారి కృషిని కూడా హైలైట్ చేయాలని అనుకుంటున్నాం’ అని  డాక్టర్ నబత్ లఖానీ అన్నారు.

బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులకు ఆటిజం గురించి ప్రఖ్యాత నిపుణుల బృందం నుంచి విలువైన సమాచారం అందించడంతో పాటు  సమాజానికి ఆటిజం గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుంది. నిపుణుల ప్యానెల్ ఆటిజం గురించిన వివిధ అంశాలను పరిష్కరిస్తుంది.  పిల్లలలో ఆలస్యమైన అభివృద్ధి సంకేతాలను గుర్తించడం నుంచి రోగనిర్ధారణ ప్రక్రియ, ఆటిజం సంపూర్ణ నిర్వహణ వరకు ప్రతీ సమాచారాన్ని అందిస్తుంది.

ఈ కార్యక్రమంలో శిశు వైద్యులు, సైకాలజిస్టులు, ప్రత్యేక అధ్యాపకులు, ఆటిజం న్యాయవాదులతో సహా ఈ రంగంలోని నిపుణుల బృందం ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులంతా తమ నైపుణ్యాన్ని పంచుకోవడంతో కార్యక్రమానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అలాగే, వారికి అవసరమైన మార్గదర్శకాలను అందిస్తారు.

ఆటిజంతో జీవిస్తున్న కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను కళ్లకు కట్టేలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. స్పెక్ట్రమ్‌లోని చిన్నారులే ఈ షార్ట్ ఫిల్మ్‌లో  నటులుగా ఉన్నారు. వీళ్లు తమ వ్యక్తిగత అనుభవాల ద్వారా ఆటిజంపై   ప్రామాణికమైన దృక్పథాన్ని అందిస్తారు. 

ఈ ఈవెంట్‌లో భాగంగా మార్హం – రెసొనేటింగ్ రెసిలెన్స్ ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులను గౌరవించడానికి, వారి ప్రతిభను, విజయాలను పంచుకోవడానికి ‘ఆటిస్టిక్ స్టార్స్’ పురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ప్రతిభావంతులైన ఆటిస్టిక్ పిల్లలందరికీ రాష్ట్ర గవర్నర్ ఈ అవార్డులను అందజేస్తారు.

More Press Releases