ప్రపంచ శాంతి పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియుల కోసం విశిష్ట పుస్తక ఆవిష్కరణ

Related image

రచయితగా, పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఎక్స్ పర్ట్ గా..తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన  డాక్టర్ వంగిపురం శ్రీనాథాచారి  ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలోవేసుకున్నారు. ఆయన తాజాగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ శాంతి, సామరస్యాలను కాంక్షిస్తూ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వోకేషన్ అనే సుదీర్ఘ భావోద్వేగ గీతాన్ని ఆంగ్లంలో రాశారు. ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో ఐపీఎస్ అధికారి సుమతి, ప్రముఖ సినీ రచయిత్రి భారవి తదితరులు పాల్గొన్నారు.

“ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్”  అనే సుదీర్ఘ భావగీతం వివరాలు, ప్రత్యేకతలు:
1.మానవచరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో దైవం, దైవస్వరూపులైన మానవాళిని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ  భావగీతం
2.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం
3.ఈ ఏకైక, విశిష్ట పుస్తక విక్రయం ద్వారా వచ్చే 100% డబ్బు సమాజానికే!
4.ఐక్యరాజ్యసమితి దినోత్సవం,  24-10-2023 న ఈ పుస్తకం ఐక్యరాజ్యసమితికి అంకితం

పుస్తకం టైటిల్ / శీర్షిక : “ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” (An Invaluable Invocation)  ఓ అమూల్యమైన ప్రార్థన 
కవి/రచయిత : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
సాహిత్య ప్రక్రియ/ జానర్ : సుదీర్ఘ కావ్యం  (Epic poem)
రచన ఉద్దేశం, ఆశయం (Scope) : మానవ చరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ  భావగీతం.
ప్రధానాంశం / ఇతివృత్తం (Theme) : ప్రపంచ శాంతి, సామరస్యం
రచన నిర్మాణక్రమం (Structure) : 10 కావ్యభాగాలు / ఆశ్వాసాలు (Cantos)

1.Prelude to Peace (శాంతి ప్రస్తావన / శాంతి పీఠిక)
2.Invocation (ప్రార్థన)
3.Humanity and Unity (మానవజాతి-ఐక్యత)
4.The Broken World (దుఃఖమయ ప్రపంచం)
5.Global Peace and Unity (ప్రపంచ శాంతి-ఐక్యత)
6.United Nations, United Efforts  (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ) 
7.Protecting Our Planet  (భూమాత పరిరక్షణ)
8.Realization and Power (మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు)
9.The Final Verse : A Summation of Our Journey (అంతిమ పద్యకృతి--ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం) 
10.Acknowledgments  (కృతజ్ఞతాంజలి)

అతి ముఖ్యమైన ప్రపంచ సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రపంచ శాంతిని సాధించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తుంది.
ప్రత్యేకత : ఆంగ్లభాషలో  సుదీర్ఘ భావగీతం (an Ode) రూపంలో  ప్రపంచ శాంతి గురించి మానవ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన అన్వేషణ.
దాతృత్వపు వివరణ (Philanthropic) : ప్రత్యేకంగా తయారుచేసిన ఈ అద్వితీయ, విశిష్ట పుస్తక విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో  నూరు శాతం డబ్బు ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలకు వరుసగా 50%, 25%, 25% లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అంకితం.

రచయిత నేపథ్యం : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంగ్లిష్ లో పీహెచ్ డీ / Ph.D., సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేసి, పాలమూరు విశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్, ఆంగ్ల విభాగాధిపతిగా సేవలందించి, బహుళ విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిత్వ వికాస నిపుణులు. “Forsake Me Not” టైటిల్ తో వీరు ఆంగ్లంలో ఓ కవితా సంపుటి వెలువరించారు. అది అమెజాన్ ఆన్ లైన్ లో ‘ఈబుక్’ గా అందుబాటులో ఉంది. ఎన్నో పత్రికలలో ఆంగ్లంలో వీరు రాసిన కవితలు అచ్చు అయ్యాయి. ఇంగ్లిష్ జాతీయాలపై  వీరు రాసిన “హ్యాండీ క్రిస్టల్స్ (Handy Crystals)” పుస్తకానికి 2010 లో ‘Longest title of a book’ అనే అంశంలో గిన్నిస్ రికార్డు నమోదైంది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస శిక్షకులుగా  ‘ఫ్రీలాన్స్’ సేవలందిస్తున్నారు, పలు సంస్థల్లో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ పుస్తకం ఎవరికోసం?: ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులు, ప్రపంచ పౌరులు, ప్రతిఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే అద్వితీయ, అమేయ భావగీతమిది.

More Press Releases