సిరివెన్నెల అభిమానులకు శుభవార్త

సిరివెన్నెల అభిమానులకు శుభవార్త
ప్రముఖ సినీ గీతరచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కలంనుండి జాలువారిన సినీసాహిత్యం (నాల్గు సంపుటాలు), సినీయేతర సాహిత్యం (రెండు సంపుటాలు) మొత్తం ఆరు సంపుటాలను సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో తానాసంస్థ సాహిత్యవిభాగం-తానా ప్రపంచసాహిత్యవేదిక ప్రచురించాలని తలపెట్టిన మహాయజ్ఞం పూర్తయినదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

తానా అధ్యక్షులు (2021–2023) అంజయ్య చౌదరి లావు నిర్వహణలో, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ సంపాదకులుగా, ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ ప్రధాన సంపాదకులుగా అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ గ్రంధాలు విశ్వవ్యాప్తంగా ఉన్న సిరివెన్నెల అభిమానులకు తరగని సిరిగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. 

“సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం– సినిమా పాటలు” మొదటి సంపుటి (1986 నుండి 1992 వరకు-513 పాటలు); రెండవ సంపుటి (1993 నుండి 1995 వరకు-509 పాటలు); మూడవ సంపుటి (1996 నుండి 2002 వరకు - 549 పాటలు); నాల్గవ సంపుటి (2003 నుండి 2022; 470 పాటలు) మొత్తం 2, 041 పాటలను అక్షరబద్ధం చేశాము. సినీయేతర సాహిత్యం ఐదవ సంపుటి (417 పేజీలు) మరియు ఆరవ సంపుటి (464 పీజీలు) గా వెలువరించాము.

ఇప్పుడు “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం ఆరు సంపుటాలు ఇటు అమెరికాదేశంలోను, అటు భారతదేశంలోను లభ్యమవుతున్నాయి. అమెరికాలో కొనుగోలుచేసే ఆసక్తిఉన్నవారు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ను చరవాణి 817.300.4747 లో గాని ఈమెయిల్: [email protected] ద్వారాగాని సంప్రదించవచ్చును.

భారతదేశంలో కొనుగోలు చేయదలచిన వారు శ్రీరామశర్మ గారిని 91-94400-66633లో గాని [email protected] ద్వారాగాని సంప్రదించవచ్చును.

ధన్యవాదాలు,

డా. ప్రసాద్ తోటకూర, 
తానా ప్రపంచసాహిత్యవేదిక
Sirivennela
Sirivennela Seetharama Sastry
Telugu
Tollywood
USA
NRI
Prasad Thotakura
Anjaiah Chowdary Lavu
Tana Prapancha Sahitya Vedika
TANA

More Press News