లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా ‘ధీర’ గ్లింప్స్ విడుదల

లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా ‘ధీర’ గ్లింప్స్ విడుదల

‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో  లక్ష్ చదలవాడ ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్ మాస్ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నారు.  ‘ధీర’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ధీర నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. నేడు లక్ష్ చదలవాడు పుట్టిన రోజు సందర్భంగా ధీర నుంచి అప్డేట్ ఇచ్చారు. ధీర మూవీ నుంచి గ్లింప్స్‌ను దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ చదలవాడ హీరోయిజం ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో డైలాగ్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి.

'ఇరవై మంది వెళ్లారు కదరా?.. అవతల వాడు ఒక్కడే.. వార్ ని కూడా వార్మ్ అప్‌లా చేసేశాడు..' అనే డైలాగ్స్‌తో డైరెక్టర్ విక్రాంత్ లక్ష్ హీరోయిజాన్ని అమాంతం ఎలివేట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ లుక్స్, మ్యానరిజం అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రాబోతోంది.

నటీనటులు :  లక్ష్ చదలవాడ, సోనియా భన్సాల్

సాంకేతిక బృందం
సమర్పణ : చదలవాడ బ్రదర్స్ 
బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వ
నిర్మాత : పద్మావతి చదలవాడ
రచన, దర్శకత్వం : విక్రాంత్ శ్రీనివాస్
సంగీత దర్శకుడు :  సాయి కార్తీక్
ఎడిటర్ :  వినయ్ రామస్వామి
కెమెరామెన్ :  కన్నా పీసీ
పిఆర్ఓ : సాయి సతీష్ 




Dheera
Laksh Chadalavada

More Press News