ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్
- ఈ రోజు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్బంగా అందజేత - తెలంగాణ హస్తకళలు, పర్యాటక కేంద్రాలకు లభించిన గుర్తింపు.

జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. వాటిలో జనగామ జిల్లాకు చెందిన పెంబర్తితో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ ఉన్నాయి. బుధవారం నాడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలాజా రామయ్యర్, పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు,సిద్దిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి,చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ అందుకున్నారు. 
World Tourism Day
Telangana

Watch Today's Deals on Amazon

More Press News