P-8I కోసం ఆత్మనిర్భర్ భారత్ భవిష్యత్ దృక్పథం వెల్లడించిన బోయింగ్

Related image

•       ఇండియన్ నేవీ యొక్క P-8I ఫ్లీట్ 40,000 కంటే ఎక్కువ విమాన గంటలతో అసాధారణమైన మిషన్ సంసిద్ధతను నిర్వహించింది.  

•       2032 నాటికి $3.2 బిలియన్ల ఆర్థిక ప్రభావాన్ని బోయింగ్ అంచనా వేసింది


న్యూఢిల్లీ, సెప్టెంబరు 21, 2023 - బోయింగ్ [NYSE: BA] ఈరోజు తన P-8I సముద్ర నిఘా విమానాల తయారీ మరియు నిలకడలో సాధించిన గణనీయమైన స్వదేశీకరణను ప్రధానంగా వెల్లడి  చేసింది మరియు ఈ ప్లాట్‌ఫారమ్ కోసం తమ దృక్పథం గురించి మీడియాకు వివరించింది. తమ  ఆత్మనిర్భర్ భారత్ వ్యూహంలో భాగంగా పెట్టుబడి మరియు ఆర్థిక ప్రభావం పరంగా వృద్ధిని ఇది  సూచిస్తుంది. పన్నెండు P-8Iలు ఇప్పటికే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియన్ నేవీ యొక్క  సముద్ర గస్తీ  మరియు నిఘా అవసరాలకు సేవలు అందిస్తున్నాయి.


బోయింగ్ ఇప్పటికే గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సృష్టించింది, ఇది భారత నావికాదళంతో సేవలో ఉన్న ప్రస్తుత P-8I విమానాల సముదాయానికి మద్దతుగా $1.7 బిలియన్లుగా ఉండవచ్చు.  అంతేకాకుండా , బోయింగ్ P-8I విమానాలను 18 విమానాలకు పెంచడం వల్ల పెట్టుబడులు దాదాపు $1.5 బిలియన్లు పెరుగుతాయని, అదే సమయంలో 2032 నాటికి భారతదేశం యొక్క ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో మరింత స్వదేశీీకరణ అవకాశాలను సృష్టించనుందని భావిస్తోంది. 


“ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ను అభివృద్ధి చేయడంలో బోయింగ్ యొక్క నిబద్ధత P-8I విమానాల పట్ల మా అంకితభావాన్ని నడిపిస్తుంది. భారత నావికాదళానికి మరిన్ని P-8I విమానాల అవసరానికి  తగినట్లుగా మేము ప్రతిస్పందిస్తున్నందున, భారతదేశం మరియు ప్రపంచ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం కోసం భారతదేశంలో, భారతదేశం మరియు ప్రపంచంలోని ఇంజినీరింగ్, తయారీ మరియు సుస్థిరత సామర్థ్యాలను మెరుగుపరచడానికి మేము చురుకుగా చూస్తున్నాము, ”అని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అన్నారు.


2013లో పరిచయం చేసిన నాటి నుండి, 737 నెక్స్ట్ జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన P-8I ఎయిర్‌క్రాఫ్ట్, ఇండియన్ నేవీ ఫ్లీట్‌లో అంతర్భాగంగా మారింది మరియు అధిక మిషన్ రెడీనెస్ రేట్ తో 40,000 విమాన గంటలను అధిగమించింది. INS రాజాలిలో అశోక్ రాయ్ ట్రైనింగ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్‌  మరియు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించబడిన , P-8I ఎయిర్‌క్రూ మరియు టెక్నికల్ టీమ్ ట్రైనింగ్ కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిమ్యులేటర్‌ను కలిగిన  కొచ్చి ట్రైనింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడంలో బోయింగ్ కీలక పాత్ర పోషించింది. ఈ భూ-ఆధారిత శిక్షణ విమానంలో శిక్షణ సమయాన్ని తగ్గిస్తుంది, భారత నౌకాదళానికి మిషన్ నైపుణ్యం మరియు విమానాల లభ్యతను పెంచుతుంది.


"భారత్ మరియు ఇండో-పసిఫిక్‌లకు ఇంటర్‌ఆపరేబిలిటీ మరియు సముద్ర భద్రతా అవసరాలను పెంపొందించేటప్పుడు P-8 నిరూపితమైన మల్టీ -మిషన్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా అందించే అసాధారణమైన సామర్థ్యంపై భారత నావికాదళంతో భాగస్వామ్యం చేసుకున్నందుకు మేము గర్విస్తున్నాము" అని వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ మేనేజర్, మొబిలిటీ, సర్వైలెన్స్ మరియు బాంబర్స్, బోయింగ్ డిఫెన్స్, స్పేస్ & సెక్యూరిటీ డాన్ గిలియన్ అన్నారు. "భారతదేశంలో తన P-8 సరఫరాదారుల నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కూడా బోయింగ్ కట్టుబడి ఉంది, ఇందులో ప్రస్తుతం 15 పబ్లిక్ మరియు ప్రైవేట్ సూక్ష్మ ,చిన్న & మధ్య తరహా వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇవి బోయింగ్ యొక్క గ్లోబల్ సప్లై చెయిన్‌లో భాగంగా ఉన్నాయి మరియు P-8.కోసం క్లిష్టమైన భాగాలు, విడిభాగాలు మరియు సేవలను అందజేస్తున్నాయి " అని అన్నారు 


ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన P-8 ఫ్లీట్, ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్వే, దక్షిణ కొరియా మరియు జర్మనీ వంటి మిత్రదేశాలలో 500,000 కంటే ఎక్కువ ప్రమాదాలు లేని విమాన గంటలను కలిగిం 160 విమానాలు సేవలో ఉన్నాయి. 

More Press Releases