సరికొత్త ఏప్రిలియా స్టార్మ్ SR అనుభవాలను పొందటానికి 100 మందికి పైగా ఉత్సాహభరితమైన రైడర్‌లను ఆకర్షించిన హైదరాబాద్‌లోని ఏప్రిలియా ట్రాక్ డే

Related image

హైదరాబాద్, 17 సెప్టెంబర్ 2023 - ఇటాలియన్ పియాజియో గ్రూప్ యొక్క 100% అనుబంధ సంస్థ మరియు ఐకానిక్ వెస్పా మరియు స్పోర్టీ అప్రిలియా శ్రేణి స్కూటర్‌ల తయారీదారు, పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్,  హైదరాబాద్‌లోని రైడింగ్ ఔత్సాహికుల కోసం ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజకరమైన ట్రాక్ డేని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో 100 మంది రైడర్‌లు ఏప్రిలియా యొక్క సరికొత్త పెర్ఫార్మెన్స్ స్కూటర్  ఏప్రిలియా SR స్టార్మ్‌ను అనుభవాలను పొందారు.PITSTOP-Go కార్టింగ్ వద్ద ఈ  థ్రిల్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.   రైడర్‌లకు కొత్త స్కూటర్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించే అవకాశం ఇక్కడ కలిగింది.

అసాధారణమైన i-గెట్ ఇంజన్‌ ఏప్రిలియాలో అమర్చబడినది.  కొత్త ఏప్రిలియా SR స్టార్మ్ 125cc, 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఇంజన్‌తో వస్తుంది. కేవలం 9.6 సెకన్లలో 0-60 Km/Hr వేగాన్ని అందుకుంటుంది. ట్రాక్ డే గురించి పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 2W డొమెస్టిక్ బిజినెస్ (ICE) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ. అజయ్ రఘువంశీ మాట్లాడుతూ, “ఏప్రిలియా పర్ఫామెన్స్ మెషీన్‌ అనుభవాలను హైదరాబాదు ప్రత్యక్షంగా పొందాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు ట్రాక్ డే అనుభవం కోసం వచ్చిన అభిమానులు  మాకు ఆనందం నింపారు. వేగవంతమైన మరియు తేలికైన , ఏప్రిలియా SR స్టార్మ్ సరికొత్త ఇంజిన్‌తో  బెంచ్‌మార్క్ పనితీరును అందిస్తుంది. ఇది రహదారిపై మెరుగైన నియంత్రణను నిర్ధారిస్తుంది మరియు మీరు ఎక్కడికి వెళ్లినా రైడింగ్‌ను సరదాగా మరియు డైనమిక్‌గా చేస్తుంది” అని అన్నారు. కొత్త ఏప్రిలియా SR Strom 125 ఆకర్షణీయమైన ధర INR 1,08,344 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). కొత్త స్కూటర్ మాట్ బ్లాక్, మ్యాట్ రెడ్, మ్యాట్ ఎల్లో మరియు గ్లోసీ వైట్ అనే 4 రంగులలో లభిస్తుంది మరియు తెలంగాణలోని అన్ని ప్రత్యేకమైన వెస్పా మరియు ఏప్రిలియా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.

More Press Releases