జింఖానా గ్రౌండ్స్‌లో అమెరిక‌న్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేష‌న‌ల్స్ ప్రారంభం

Related image

* టైటిల్ ఫేవ‌రెట్‌గా తెలంగాణ జ‌ట్టు

 
హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 19, 2023: అమెరిక‌న్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేష‌న‌ల్స్ 2023 పోటీల‌ను హైద‌రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో శ‌నివారం ఘ‌నంగా ప్రారంభించారు. దీనికి ఎల్ఐసీలో దేశంలోనే నెం.1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజ‌ర్ (సీఎల్ఐఏ), భార‌త జ‌ట్టు బ్రాండ్ అంబాసిడ‌ర్ కౌటికె విఠ‌ల్ హాజ‌ర‌య్యారు. ఈసారి టైటిల్ ఫేవరెట్ల‌లో తెలంగాణ జ‌ట్టు కూడా ఉంది. ఇప్ప‌టికే ఇది కేర‌ళ‌, హ‌ర్యానా జ‌ట్ల‌ను గ్రూప్ మ్యాచ్‌ల‌లో ఓడించి, గ్రూపులో అగ్ర‌స్థానానికి చేరుకుంది. మొత్తం 12 పురుషుల జ‌ట్లు, 8 మ‌హిళ‌ల జ‌ట్లు ఈ పోటీల‌లో పాల్గొంటున్నాయి.

 
పురుషుల జ‌ట్లు: తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, పంజాబ్‌, చండీగ‌ఢ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, హ‌ర్యానా.

 
మ‌హిళ‌ల జ‌ట్లు: రాజ‌స్థాన్‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, పంజాబ్‌, చండీగ‌ఢ్‌.

 

నేష‌న‌ల్స్‌లో వారి ఆట‌తీరును బ‌ట్టి భార‌త జ‌ట్టుకు క్రీడాకారుల‌ను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన‌వారు అక్టోబ‌ర్ నెల‌లో మ‌లేషియాలో జ‌రిగే ఏషియ‌న్ ఓషియానిక్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త‌దేశం త‌ర‌ఫున ఆడ‌తారు. భార‌త జ‌ట్టు గ‌తంలో 2018, 2021 సంవ‌త్స‌రాల్లో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్స్‌లో పాల్గొంది. అమెరిక‌న్ ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాకు అంత‌ర్జాతీయ ఫెడ‌రేష‌న్ అమెరిక‌న్ ఫుట్‌బాల్‌, భార‌త ఒలింపిక్ సంఘాల గుర్తింపు ఉంది.

More Press Releases