కిమ్స్ హాస్పిటల్స్ లో లైవ్ చర్మ సౌందర్య శస్త్రచికిత్స

Related image

* టీఎస్ఐఏడీవీఎల్, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డెర్మోటో సర్జరీ సదస్సు

* తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న 400 మంది డెర్మటాలజిస్టులు

 
హైదరాబాద్, జూలై 23, 2023: టీఎస్ఐఏడీవీఎల్ మరియు కిమ్స్ ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం కలిసి సంయుక్తంగా డెర్మోటో సర్జరీ సదస్సును ఆదివారం నిర్వహించాయి. కిమ్స్ ఆస్పత్రిలోని మూడోబ్లాకులో గల ఆడిటోరియంలో ఉదయం 8.00 నుంచి సాయంత్రం 5.00 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది డెర్మటాలజిస్టులు పాల్గొన్నారు. చర్మ వ్యాధుల, శస్తచికిత్సల గురించి సదస్సులో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డా. బొల్లినేని భాస్కర్ రావు మాట్లాడారు. చర్మ సౌందర్య శస్త్రచికిత్సలు ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందాయన్నారు. సినితారల నుండి సామాన్య ప్రజల వరకు ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ శస్త్రచికిత్సలో వస్తున్న అధునాతన పద్దతులపై వైద్యులకు అవగాహగాన ఉండాలని సూచించారు. ఇలాంటి సదస్సులు డాక్టర్లకు ఎంతో దోహదం చేస్తాయని వ్యాఖ్యనించారు. దీని ద్వారా సమగ్ర శస్త్రచికిత్స నైపుణ్యం పెరుగుతుందన్నారు.

అనతంరం కిమ్స్ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టేషన్ డాక్టర్. ఆనందర్ కుమార్ వగ్గు మాట్లాడుతూ మొదటిసారిగా ఇక్కడ లైవ్ లో చర్మ సౌందర్యానికి సంబంధించిన శస్తచికిత్సను చేశామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది వైద్యులకు ఇది చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

వెటిలిగో సర్జరీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, అకినెల్కార్ సర్జరీ, నెయిల్ సర్జరీలు లైవ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏడివిఎల్ అధ్యక్షుడు డా. అనూప్ కుమార్ లహరి, సెక్రటరీ డా. ఇందిరా, ఎస్ఐజి కన్వీనర్ డా. నితిన్ జైన్, కో-ఆర్డినేటర్ డా. యోగోష్ పాల్గొన్నారు.

More Press Releases