ప్రపంచ ఎమ్ఎస్ఎమ్ఈ దినోత్సవం సందర్భంగా, అమెజాన్ భారతీయ అమ్మకందారులకు సులభతరం చేసే సరళీకృత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది

Related image

అమెజాన్ ఇండియా భారతదేశంలోని వ్యాపారాల కోసం ఆన్‌బోర్డింగ్ అనుభవాన్ని సరళం చేయడమే కాకుండా, ఆన్‌బోర్డింగ్‌ను పూర్తి చేసేందుకు తెలివైన సూచనలు, కిటుకులను అందిస్తూ, క్రమబద్ధీకరించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ కొత్త, మెరుగైన ప్రక్రియ అమెజాన్.ఇన్ (Amazon.in)లో విక్రయదారులుగా శ్రమరహితంగా పేర్లు నమోదు చేసుకునేందుకు, కేవలం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి తమ విక్రయాల ప్రయాణాన్ని ప్రారంభించేందుకు విక్రేతలను అనుమతిస్తుంది. ఇది అవసరమైన సమాచారాన్ని ముందస్తుగా అందించడమే కాకుండా, మెషీన్ లెర్నింగ్-ఉత్పత్తి చేసిన స్టోర్ పేరు మరియు షిప్పింగ్ ప్రాధాన్యతలు తదితర ఉత్తమ ఎంపికలను కూడా సూచిస్తుంది. ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలను పరిష్కరించేందుకు రియల్-టైమ్ మద్దతుతో వేగవంతమైన మరియు సమర్థవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్ధారిస్తుంది.

 
ప్రస్తుతం, 65% అమెజాన్ విక్రేతలు చిన్న, మధ్యతరహా సంస్థలకు చెందిన వారే ఉన్నారు. ఈ నిష్పత్తి అప్ ట్రెండ్‌ను చేసేలా సెట్ అయ్యింది. అయినప్పటికీ, ఈ విక్రేతలలో చాలామందికి అధునాతన సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం వల్ల అమెజాన్‌లో జిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పునరుద్ధరించబడిన రిజిస్ట్రేషన్ విధానంతో వారికి ప్రతి దశలోనూ విలువైన సహాయాన్ని అందించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించేందుకు అవకాశం కల్పిస్తుంది. విక్రేతలు అమెజాన్‌లో తమ విక్రయాల ప్రయాణాన్ని నిమిషాల వ్యవధిలో, సమస్యలు లేదా అడ్డంకులు లేకుండా ప్రారంభించేలా చేస్తుంది. ఈ కొత్త, సురక్షితమైన అనుభవం ద్వారా, ఖాతాను సృష్టించడం అనేది చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను అందించినంత సులభం. ఒకసారి లాగిన్ అయిన తర్వాత, విక్రేతలు వ్యాపారం కోసం వారి జిఎస్‌టిఐఎన్ (GSTIN)ని మాత్రమే నమోదు చేయవలసి ఉంటుంది.


అమెజాన్ ఇండియా, సెల్లింగ్ పార్ట్‌నర్ సర్వీసెస్ డైరెక్టర్ అమిత్ నందా మాట్లాడుతూ, “ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి దశ - రిజిస్టర్ చేయడం మరియు ఆన్‌బోర్డింగ్ చేయడం - తరచుగా ఇ-కామర్స్‌కు కొత్తగా ప్రవేశించే చిన్న వ్యాపారాలకు ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా, ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశాన్ని చేజిక్కించుకునే మొబైల్ పరికరం మరియు జిఎస్‌టిఐఎన్ (GSTIN) కన్నా ఎక్కువ మంది భారతీయ వ్యాపారవేత్తల కోసం మేము ఎదురు చూస్తున్నాము.

 
ప్రస్తుతం అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో 1.2 మిలియన్లకు పైగా విక్రేతలు భాగంగా ఉంటూ, కంపెనీ ప్రారంభించిన వివిధ ప్రోగ్రామ్‌లు, సేవలు మరియు కార్యక్రమాల నుంచి లబ్ధి పొందుతున్నారు. ఇది స్థానిక దుకాణాలు, సాంప్రదాయ నేత కార్మికులు, కళాకారులు, మహిళా వ్యాపారవేత్తలు అలాగే స్టార్టప్‌లు మరియు డిజిటల్ వ్యాపారవేత్తలతో సహా అన్ని పరిమాణాల వ్యాపారాలను కలిగి ఉండగా, వారు తమ ఉత్పత్తులను అమెజాన్.ఇన్ (Amazon.in)లో అందుబాటులో ఉంచారు. అమెజాన్ ఇండియా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని స్థానిక పొరుగు దుకాణాల కోసం వారి ఆఫ్‌లైన్ సేవలను ఏకీకృతం చేసేందుకు మరియు అమెజాన్.ఇన్ (Amazon.in) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశాన్ని, అమెజాన్‌లోని స్థానిక దుకాణాలు వంటి ఫోకస్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా అందిస్తుంది.

 
కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలుసుకునేందుకు, Google PlayStore/iOS Appstore యాప్‌స్టోర్ నుంచి సెల్లర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా sell.amazon.inని సందర్శించడం ద్వారా అమెజాన్‌లో విక్రయించేందుకు మీ ఖాతాను నమోదు చేసుకోండి & ‘Start Selling’ బటన్‌పై క్లిక్ చేయండి.

More Press Releases