vemula prashanth reddy: తెలంగాణ ఆర్.అండ్.బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరి ఆవిష్కరించిన..
Add ap7am to your home Screen

తెలంగాణ ఆర్.అండ్.బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరి ఆవిష్కరించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ ఆర్.అండ్.బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరి ఆవిష్కరించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ఈ రోజు తెలంగాణ ఆర్.అండ్.బి శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సరం 2020 డైరిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు, చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం డైరి ఆర్.అండ్.బి శాఖ సిబ్బంది సౌకర్యార్థం తీసుకురావడం జరుగుతుందని ఇందులో డిపార్ట్మెంట్ కి చెందిన అధికారుల పూర్తి సమాచారం, మొబైల్ నెంబర్స్ పొందుపరచబడినవి అని సిబ్బంది మంత్రికి వివరించారు. ప్రభుత్వ డైరి లాగనే ఈ డైరి డిజైన్ చేయడం బాగుంది అని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు.

vemula prashanth reddy
TRS
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News