డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు!

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలోని గంగోలు గ్రామంలో రూ.2.83 కోట్లతో నిర్మించిన 45 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గిరిజన, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం ఇళ్ల డబుల్ బెడ్ రూం కాలనీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యేలు పొందెం వీరయ్య అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ తదితరులు ఉన్నారు.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మి:

puvvada ajaykumar
double bed room
Telangana
badrachalam
Khammam District

More Press News