అత్యంత క్లిష్టమైన సమయంలో రోగి ప్రాణాలు కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు

Related image

 -15 సంవత్సరాలుగా గా దీర్ఘకాలిక జబ్బులతో అవస్థలు పడుతున్న రోగి 

- ఉదయం గంటపాటు తీవ్రమైన గుండె నొప్పి

- గోల్డెన్ అవర్లో మెరుగైన వైద్యం - ఐదు రోజుల  ECMO  చికిత్సతో కోలుకున్న రోగి


గత 15ఏండ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కార్డియాలజీ సమస్యలతో బాధపడుతున్న రోగికి సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ప్రాణం పోశారు.   రోగి చివరి దశకు చేరుకుని ఇక బ్రతకడం కష్టమన్న తరుణంలో 'గోల్డెన్ అవర్లో సిటిజెన్ వైద్యులు అత్యంత క్లిష్టమైన చికిత్సచేసి రోగి ప్రాణాలు రక్షించారు. ఐదు రోజులపాటు చేసిన  ECMO  చికిత్సతో రోగి సాధారణ స్థితికి చేరుకోవడం అందరిని ఆశ్చర్య పర్చింది.


వెంకటేష్ (పేరు మార్చారు) అనే 35 ఏళ్ల  వ్యక్తికి ఉదయం 5:30గంటల సమయంలో ఓ గంటపాట తీవ్రమైన నొప్పి వచ్చింది. రోగి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అప్రమత్తమైన బాధితుని కుటుంబ సభ్యులు, వెంటనే నగరంలోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ కు  తీసుకొచ్చారు.  రోగి పరిస్థితిని గమనించిన సిటిజన్స్ స్పెషాలిటీ  వైద్యులు డాక్టర్ నిఖిల్ భార్గవ్, డాక్టర్ ప్రియాంకా గుంటూర్ వెంటనే ఎమర్జెనీ బృందాలను అప్రమత్తం చేశారు కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సుధీర్ కోగంటీ రోగికి అత్యవసర చికిత్సను అందించారు. ఆ తర్వాత రోగి రక్త  ప్రసరణ లో లోపాలు గుర్తించిన వైద్యులు  ఎంఐసీయూకి తరలించారు. రోగి క్రిటికల్ కండీషన్లో ఉండటంతో వైద్య బృందాలు అనుక్షణం పర్యవేక్షించాయి . రోగి పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో రోగి బంధువులు, కుటుంబం  ఆందోళనకు గురయ్యారు. వారికి ధైర్యం చెప్పిన కన్సల్టెంట్,  ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కోగంటి మెరుగైన అందించారు. రోగి  కి ECMO చికిత్సను అందించారు. అత్యంత క్లిష్టమైన సమయం లో రోగి  ప్రాణాలు కాపాడగలిగామని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు 


సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిటికల్ కేర్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పాలెపు బి గోపాల్ మాట్లాడుతూ, తమ బృందాల యొక్క ప్రయత్నం  అభినందిస్తున్నానన్నారు  


వెంకటేష్ ప్రస్తుతం ఇంట్లోనే ఉండి సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కఠినమైన జీవనశైలిని అనుసరించి, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ, "గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలు "గోల్డెన్ అవర్". కాబట్టి, మొదటి గంటలోపు తగిన చికిత్స తో దాని ప్రభావాలను తిప్పికొట్టవచ్చు లేదా తదుపరి చికిత్స కోసం పరిస్థితిని మెరుగు పరచవచ్చు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని కార్డియాలజీ, క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీ టీమ్ యొక్క విజయాల పట్ల సంతోషం గా వుంది. 

More Press Releases