1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 Below FIDE రేటింగ్ చెస్ టోర్నమెంట్

1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 Below FIDE రేటింగ్ చెస్ టోర్నమెంట్
Ist Telangana Gurukulams ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఏప్రిల్ నెలలో(26 నుండి 30 వరకు) విజయవంతంగా నిర్వహించాము , 592 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తదుపరి టోర్నమెంట్‌గా ఇప్పుడు మేము 1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా Below 1600 rating Chess Tournament నిర్వహించబోతున్నాము TSWREIS & TTWREIS సెక్రటరీ రోనాల్డ్ రోజ్ గారి అధ్వర్యం లో ఈ టోర్నమెంట్ నిర్వహించటానికి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది *1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 Below FIDE రేటింగ్ చెస్ టోర్నమెంట్ - మొదటిసారిగా ఒక ప్రభుత్వ విద్యాసంస్థ , గుర్తింపు పొందిన చెస్ టోర్నమెంట్‌ని నిర్వహిస్తో న్నము. ఆల్ ఇండియా చెస్ అసోసియేషన్ మరియు తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు . 
◆ జూన్ 2 నుండి 4 వరకు జరుగును 
◆వేదిక:కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ,హైదరాబాద్ 
*గురుకులంలోని వర్ధమాన చెస్ క్రీడాకారులకు తగిన వేదికను అందించడానికి, వారి రేటింగ్ మెరుగుపరచుకోవడానికి మరియు ఉత్తమ రేటింగ్ పొందిన ఆటగాళ్లతో ఆడే అవకాశాన్ని కల్పించడానికి ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నారు. 
*ఈ టోర్నీ 3 రోజుల పాటు జరగనుంది. 
◆రోజూ 3 రౌండ్లు 
◆ ఈ టోర్నమెంట్ 693 క్రీడాకారులు పాల్గొంటారు 
◆ప్రైజ్ మనీగా మొత్తం 4,99,999 /- rupees నగదు 
*113 నగదు పురస్కారాలు 
*విజేతలకు 105 ట్రోఫీలు పంపిణీ చేయనున్నారు 
*ఈ టోర్నీలో మొత్తం 693 మంది పైబడిన క్రీడాకారులు పాల్గొననున్నారు.
Chess
Telangana

More Press News