10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌

10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌
ఇటీవలి కాలంలో బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రాయితీ లభిస్తుంది

హైదరాబాద్‌, 30 మార్చి 2023 : భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌, వండర్‌లా హాలీడేస్‌ తమ హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌తో తిరిగి వచ్చింది.  2022–23 విద్యా సంవత్సరంలో తమ 10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఈ ఆఫర్‌లో భాగంగా అందిస్తారు. ఈ డిస్కౌంట్ని  వండర్‌లా యొక్క బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది.

తమ ఒరిజినల్హాల్‌టిక్కెట్లను చూపడం ద్వారా విద్యార్ధులు వండర్‌లా పార్క్‌ ప్రవేశ టిక్కెట్ల పై 35% డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే విద్యార్ధులు తమ ప్రస్తుత సంవత్సర హాల్‌ టిక్కెట్‌ను పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

      సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌  https://bookings.wonderla.com/  వద్ద బుక్‌ చేసుకోవడాన్ని  వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు నేరుగా తమ టిక్కెట్లను పార్క్‌ కౌంటర్ల వద్ద కూడా  కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం  www.wonderla.com  చూడవచ్చు  లేదా  బెంగళూరులో   91 80372 30333, 91 80350 73966  ; హైదరాబాద్‌లో 0841 4676333, 91 91000 63636 మరియు కొచిలో 04843514001, 7593853107  నెంబర్లకు కాల్‌ చేయవచ్చు. 
వండర్‌లా హాలీడేస్‌

More Press News