రాజధాని రైతుల చెంతకు జనసేన!

రాజధాని రైతుల చెంతకు జనసేన!

ఒక రాష్ట్రం, మూడు రాజధానులు అనే ప్రకటనతో తీవ్ర ఆందోళనలో ఉన్న రాజధాని గ్రామాల రైతులను శుక్రవారం జనసేన నాయకులు కలుస్తారు. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచన మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని బృందం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబుతోపాటు కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు మంగళగిరిలో జనసేన కార్యాలయం నుంచి బయలుదేరి మందడం చేరుకొని అక్కడి రైతాంగం, రైతు కూలీలతో మాట్లాడతారు. అనంతరం వెలగపూడిలో రైతుల నిరాహార దీక్ష శిబిరానికి వెళ్తారు. 1గం.కు తుళ్ళూరులో వంటా వార్పు కార్యక్రమానికి హాజరవుతారు.

Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News