లోకాయుక్తను, ఉపలోకాయుక్తను నియమించిన తెలంగాణ ప్రభుత్వం!

Related image

తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. సీఎం కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ ప్రగతి భవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సీ.వి.రాములు, ఉప లోకాయుక్తగా వి. నిరంజన్ రావు పేర్లను కమిటీ సిఫారసు చేసింది.

కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలిలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా జి. చంద్రయ్య, సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమ్మద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమించింది.

More Press Releases