కన్హా శాంతి వనంలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ బయోమి ‘2023 సదస్సు

Related image

పత్రికా ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణా రాష్ట్రం ఫార్మా రంగంలో దేశ రాజధానిగా మారిందని పలువురు అంతర్జాతీయ ఫార్మా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం కన్హా శాంతివనం, శంషాబాద్ సమీపంలో జరిగిన ఇంటర్నేషనల్బ యోమి ‘2023 కాన్ఫరెన్స్ లో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా నిపుణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. సోషల్వె ల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్ల తో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రారంభ సదస్సుకు సంస్థ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బయో, ఫార్మా రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా నూతన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల కరోన లాంటి వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్ధకు విఘాతం కల్గింది. ఆ విపత్కర పరిస్థితుల్లో మన బయో, ఫార్మా రంగం ప్రపంచ మానవాళిని కాపాడింది. ఆ విధంగా విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే నూతన పరిశోధనా అంశాలపై దృష్టి సారించాలని, సమాజానికి మనం ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ కాన్ఫరెన్స్ లో అమెరికా టోలెడో యూనివర్సిటీ ప్రాసెసర్ స్కాట్ హాల్, ఫ్రాన్స్ ఎంబసి అధికారి స్టాన్స్, కేంద్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోలర్డా క్టర్ రాం కిషన్, హైద్రాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్రె డ్డన్న, ఫార్మా ఇండస్ట్రీ రంగం నిపుణులు, డాక్టర్ శశిర్ కుమార్, ప్రొఫెసర్ప న్నుర్ సెల్వం, డాక్టర్ దర్శనా జోషి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్అ ధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సులో వేలాది మంది ట్రైబల్ గురుకుల కళాశాలల
విద్యార్థులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------------------------------------------------------------------------

More Press Releases