ప్రియాంక రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

ప్రియాంక రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
  • దోషులను కఠినాతికఠినంగా శిక్షిస్తాం

  • ఇలాంటి దుర్గటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం

  • దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు భద్రత కల్పిస్తున్నాం

  • షీటీమ్స్, మహిళా పోలీసు స్టేషన్లు, సఖీ సెంటర్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం

  • ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ 

రెండు రోజుల క్రితం నగర శివార్లలో దుర్మార్గుల దారుణానికి బలైన ప్రియాంకరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులకు కఠినంగా అతి త్వరలో శిక్ష పడేటట్లు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు హామీ ఇచ్చారు. ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రియాంకరెడ్డి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టమని, వారికి కఠినాతికఠినంగా శిక్ష పడుతుందని తెలిపారు.

 తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అయినా ఇలాంటి దుర్ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటుకున్నారని, కుటుంబాలకు దూరంగా ఉండి కూడా ఇక్కడ క్షేమంగా ఉద్యోగాలు, పనులు చేసుకునే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

 షీ టీమ్స్, మహిళా పోలీసు స్టేషన్లు, సఖీ సెంటర్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే ప్రియాంక రెడ్డి విషయంలో జరిగిన సంఘటన తమను తీవ్రంగా కలిచివేస్తోందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Satyavathi Rathod
Priyanka Reddy
Hyderabad
Crime News
Telangana

More Press News