ప్రారంభమైన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం!

ప్రారంభమైన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం!
  •  హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు
  • తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయాలపై చర్చ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, తోట చంద్రశేఖర్ (పార్టీ ప్రధాన కార్యదర్శి), కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, మనుక్రాంత్ రెడ్డి, బి.నాయకర్, డా.పసుపులేటి హరిప్రసాద్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, చిలకం మధుసూదన్ రెడ్డి, బి.శ్రీనివాసయాదవ్. ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్.

  • తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై చర్చ.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభిత పరిస్థితులు, ఇసుక వారోత్సవాలు చేసినా ఇప్పటికీ ఇసుక పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, అక్రమ తరలింపు అంశాలపై చర్చించనున్న కమిటీ.
  • విశాఖ లాంగ్ మార్చ్ అనంతర పరిస్థితిపై సమీక్ష.
  • రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో పాలకవర్గం అలక్ష్యంగా ఉండటం, జలవనరులను సంరక్షించుకోవడంలో వైఫల్యం, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన చర్చిస్తారు.
  • తెలుగు మాధ్యమ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడంపై, 'మన నుడి, మన నది' కార్యక్రమ నిర్వహణపై చర్చ.
  • క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై దిశానిర్దేశం చేస్తారు. 
Jana Sena
Pawan Kalyan
Hyderabad
Telangana
Andhra Pradesh

More Press News