ట్రైబల్ టూరిజం సర్క్యూట్ పనులను తనిఖీ చేసిన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి!

Related image

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక శ్రేద్ద తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేశంలో అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క- సారాలమ్మల మేడారం జాతర ఉన్నందున తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ITDA ఏజెన్సీ పరిధిలోని ట్రైబల్ టూరిజం సర్క్యూట్ క్రింద ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పరిశీలించారు. వరంగల్ - ములుగు రహదారిలో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ గట్టమ్మ మందిరం వద్ద సుమారు రూ. 7 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న హరిత హోటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మేడారం జాతర ఉన్నందున పర్యాటకుల సౌకర్యం కోసం జనవరి 15 లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అధికారులను ఆదేశించారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద సుమారు 17 కోట్లతో నిర్మిస్తున్న కాటేజ్ ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పరిశీలించారు. ఇప్పటికి పూర్తి అయిన 8 కాటేజ్ లను పరిశీలించారు. లక్నవరం సరస్సును ఎకో టూరిజంగా అభివృద్ధి చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సరస్సులో ఇంకా ఎన్నో ఐలాండ్ లు ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని టూరిజం అధికారులను ఆదేశించారు. లక్నవరం సరస్సుకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి అనువైన ప్రదేశంగా ఉందన్నారు.

లక్నవరం సరస్సులోని లాంచీల పనితీరును పరిశీలించారు. లాంచీల నిర్వాహణ, పర్యాటకులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. మిగిలిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. లక్నవరం సరస్సును సందర్శిస్తున్న దేశీయ, విదేశీ పర్యాటకుల వివరాలను పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి.

More Press Releases