కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసిన యార్లగడ్డ!

కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసిన యార్లగడ్డ!
  • ఢిల్లీలో భేటీ అయిన యార్లగడ్డ

  • అమరావతి, విశాఖపట్నంను సందర్శించాలని వినతి

  • సానుకూలంగా స్పందించిన జస్టిస్ బాబ్డే

భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం , ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ఢిల్లీలో జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేతో భేటీ అయిన యార్లగడ్డ, ఆయనకు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాలను బహూకరించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో అటు అమరావతిని, ఇటు విశాఖపట్నంను సందర్శించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ కాబోయే ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై జస్టిస్ బాబ్డే సానుకూలంగా స్పందిస్తూ సమయానుకూలంగా వస్తానని హామీ ఇచ్చారు.

Supreme Court
Yarlagadda
Sharad Arvind
New Delhi
Vijayawada
Andhra Pradesh

More Press News