లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ ప్రక్రియను వేగవంతం చేయాలి: వీఎంసీ కమిషనర్
- అధికారులకు ఆదేశాలు: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఈ సందర్బంలో లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సత్వరమే అందరికి బ్యాంక్ నందు ఖాతాలు ఇప్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్దిదారులకు అసౌకర్యం కలుగకుండా అవసరమైన త్రాగునీటి సౌకర్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచిస్తూ, లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా అధనంగా బ్యాంక్ సిబ్బందిని కూడా పెంచాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.
ఈ సందర్బంలో సర్కిల్-2 కార్యాలయంలో గల క్యాష్ కౌంటర్ ను పరిశీలించి అక్కడ విధులలో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పన్నులు వసూళ్ళు చేయు సందర్బంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనచొ ఉన్నతాధికారులకు దృష్టికి తిసుకురావాలని సూచించారు.
పర్యటనలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.