ఈ నెల 21న 75 జీహెచ్ఎంసీ పార్కులలో సంగీత విభావరి - మార్కింగ్ రాగాస్ కార్యక్రమం

Related image

  • ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విభిన్న వాయిద్యపరికరాలతో సంగీత ప్రదర్శన
  • ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశరుసుము లేదు
  • మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్
75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 21 న 75 జీహెచ్ఎంసీ పార్కులలో 75 మంది సంగీత విద్వాంసులచే సంగీత విభావరి - మార్నింగ్ రాగాస్  ప్రభాత గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఈ ప్రభాత గీతాలాపన సంగీత విభావరి ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరి - మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమమునకు ఎటువంటి ప్రవేశరుసుము లేదని తెలిపారు. ఉచితంగా మార్నింగ్ రాగాస్ ను ఆస్వాదించవచ్చని అర్వింద్ కుమార్ తెలిపారు.

More Press Releases