కోమటిపల్లి ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్‌ ఆగ్రహం

కోమటిపల్లి ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్‌ ఆగ్రహం
  • నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారిపై అత్యాచారం ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన చాల బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ మరియు, కలెక్టర్ లను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆదేశించారు.
Sunitha Laxma Reddy
Bhadradri Kothagudem District

More Press News