మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి జనసేనాని లాంగ్ మార్చ్!

మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి జనసేనాని లాంగ్ మార్చ్!

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభం అవుతుంది. 3వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్ సమీపంలో జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాంగ్ మార్చ్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే వాహనాలకు ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది.

Jana Sena
Pawan Kalyan
Vizag
Andhra Pradesh

More Press News