సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
  • హాజరైన  శాసనసభ్యులు నోముల భగత్, శాసనమండలి సభ్యులు యంసి కోటిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు
  • దశాబ్దా కాలం తరువాత జులైలో నీటి విడుదల
  • జులైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఐదోసారి
  • స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జులైలో విడుదల చేయడం ఇదే ప్రథమం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు
  • ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు
  • నల్లగొండ జిల్లాలో 1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతలతో కలుపుకుని 2,41,000 వేల ఎకరాలు
  • టియంసిల వారిగా నల్లగొండ జిల్లాకు18 టియంసిలు సూర్యాపేట జిల్లాకు 18 టియంసిలు ఖమ్మం జిల్లాకు 29 టియంసిలు
  • కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్
  • తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు
  • సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే అదనంగా వచ్చి చేరుతున్న నీరు
  • సంబురాలు వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం
నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదలకు ముందు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిన విడుదల అనంతరం గంగమ్మ తల్లికి పుష్పాభిషేకం చేస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు.
G Jagadish Reddy
Telangana

More Press News