నీటి కాలుష్యాన్ని అరికట్టండి: వీఎంసీ కమిషనర్

నీటి కాలుష్యాన్ని అరికట్టండి: వీఎంసీ కమిషనర్
  • నగరంలో పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజ‌య‌వాడ‌: నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుదవారం 48, మరియు 51 వ డివిజన్ లో పలు విధులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ ద్వారా మురుగునీటి పారుదల తీరును పరిశీలించి మురుగునీటి పారుదల సక్రమముగా జరగని డ్రెయిన్స్ నందు తక్షణమే సిల్ట్ తొలగింపు పనులను చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కొండప్రాంతములో కాల్వలో నుండి పోవు వాటర్ పైప్స్ పైకి లేపి రోడ్ మార్జిన్ లో ఫిక్స్ చేయాలి, సైడ్ లైన్స్ లో మెయిన్ లైన్ వేసి దాని నుండి ఇళ్ళకు కనెక్షన్ ఇవ్వాలి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

35  వ డివిజన్ లో పూర్ణనందపేట కెనాల్ బండ్ ఫెన్సింగ్ వర్క్ వెంటనే కంప్లీట్ చేయాలి, ఫ్రైజేర్ పేట మెయిన్ రోడ్ లోని నమ్మ టాయిలెట్స్ వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని, CK రెడ్డి  రోడ్ లో కెనాల్ బండ్ లో పడిపోయిన ఫెన్సింగ్ ను వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా బందరు రోడ్డు లోని ఈట్ స్ట్రీట్ నంబర్స్ కి పెయింటింగ్ వర్క్ ఇంకను పూర్తి కాలేదు దానిని వెంటనే పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News