సహాయ, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్

Related image

  • సహాయ, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్, జులై, 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • ఈ టెలీకాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తోపాటు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తుల నివారణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి,  పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
  •  ప్రతీ మండలానికి ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాం.
  • ప్రతీ గ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్, తదితర విభాగాల బృందాలను ప్రత్యేకంగా నియమించి సమర్థవంతంగా పునరావాస చర్యలను కొనసాగిస్తున్నాం.
  • పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 4100 మంది శానిటేషన్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి తరలించి సహాయ పునరావాస చర్యలను  చేపట్టాం.
  • మున్సిపల్ శాఖ నుండి 400 మంది శానిటేషన్ సిబ్బంది, మొబైల్ టాయిలెట్లు, ఇతర ఎమెర్జెన్సీ సామాగ్రిని తరలించాము. 
  • ప్రతీ గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయితీ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించి శానిటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నాం.
  • జిల్లా కలెక్టర్ తోపాటు పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీ, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతం లు, ఈ సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం 436 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సదుపాయాలు అందచేస్తున్నాము.
  • ఇప్పటి వరకు ఏవిధమైన మలేరియా, డెంగ్యూ కేసులు గానీ నమోదు కాలేదు.
  •  ప్రతీ మండలానికి ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లా మలేరియా అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నాము. 
  • గర్భిణీ స్త్రీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వైద్యసదుపాయం అవసరమైనవారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాము. 
  • ప్రతీ పునరావాస కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసాము. 
  • అన్ని గ్రామాల్లో విధ్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి వరకు పునరుద్ధరిస్తాము. 
  • ప్రతీ మండలానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాము.
  •  ఇప్పటివరకు జిల్లా అధికారులు సహాయ పునరావాస చర్యలలో సమర్థవంతంగా పాల్గొనడం పట్ల ప్రజలు అభినందిస్తున్నారు.

More Press Releases