యువ‌త‌పై అంత‌ర్జాతీయ కుట్ర జ‌రుగుతుంది: ఏపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ మ‌స్తాన్‌వ‌ల్లీ

Related image

విజ‌య‌వాడ‌: ప్ర‌పంచంలోనే అత్య‌ధిక యువ‌త భార‌త‌దేశంలో ఉంద‌ని, అటువంటి యువ‌త‌ను బ‌ల‌హిన‌ప‌ర్చేందుకు అంత‌ర్జాతీయంగా కుట్ర జ‌రుగుతుంద‌ని మాజీ ఎమ్మెల్యే, ఏపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ షేక్‌ మ‌స్తాన్‌వ‌ల్లీ పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లో ఆంధ్రవీర టీమ్ ఆధ్వ‌ర్యంలో "రాష్ట్ర రాజకీయాలు - ఎదుర్కుంటున్న సవాళ్లు "రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర " అనే అంశాలపై చర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్నికి ఏపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ షేక్‌ మ‌స్తాన్‌వ‌ల్లీ, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ నాయ‌కులు, మేదావుల పోరం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌, ప్రొపెసర్ ఉమా శ‌ర్మ‌, సీపీఎం నాయ‌కులు సీహెచ్ బాబు రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ షేక్‌ మ‌స్తాన్‌వ‌ల్లీ మాట్లాడుతూ  యువ‌త స్వ‌చ్చంధ‌గా ముందుకు వ‌చ్చి రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర  అంటూ చ‌ర్చ వేదిక నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం అన్నారు. యువ‌త రాజ‌కీయ‌ల‌కు అతీతంగా పోరాడాల‌ని పిలుపు నిచ్చారు.

యువ‌త‌ను బ‌ల‌హిన‌ప‌ర్చేందుకు జ‌రుగుతున్న అంత‌ర్జాతీయంగా కుట్ర జ‌రుగుతుంద‌ని, యువ‌త‌ను మ‌ద‌క‌ద్ర‌వాల వెపు మళ్లించేందుకు ప్ర‌య‌త్నలు జ‌రుగుత‌న్నాయ‌న్నారు. యువ‌త  శ‌క్తి  అంతం లేనిది అని, అపార‌మైంద‌న్నారు. దేశ స్వాతంత్రంలో యువ‌త పాత్ర‌కీలకం అన్నారు. దేశ జ‌నాభ‌లో 67 శాతం మంది ఉన్నారన్నారు. నేడు చంద్ర‌మండ‌లోకి అడుగుపెడుతున్న స‌మ‌యంలో  సాంకేతికంగా అభివృద్ది జ‌రుగుత‌న్న స‌మ‌యంలో కులం, రాజ‌కీయం అంటూ విభేదాలు విడ‌నాడాల‌న్నారు. కులం రాజ‌కీయ వార‌స‌త్వాల‌కు స్వ‌స్తిప‌ల‌కాల‌న్నారు.

రాష్ట్రంలో ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తే సంస్కృతి ఉంద‌ని మేధావుల పోరం అధ్య‌క్ష‌లు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యువ‌త‌కు స్పూర్తిగా ఆంధ్ర‌వీర చ‌ర్చ‌ వేదిక మంచి అలోచ‌న అన్నారు. తెలుగుజాతీకి అన్యాయం జ‌రుగుతుంటే.. యువ‌త ప్ర‌శ్నించే స్థితిలో లేద‌న్నారు. క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గానే ప్ర‌శ్నించాల‌ని సూచించారు. దేశంలోని, రాష్ట్రంలో మేడిక‌ల్ మాఫియా రాజ్యం మేలుతుంద‌న్నారు. ఈ స‌మ‌స్య అంద‌రిది అని, యువ‌త స్పందించాలన్నారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా యువ‌త ఎద‌గాల‌న్నారు. రాష్ట్రం అంటే రెండు,మూడు రాజ‌కీయ పార్టీల జాగీరు కాదున్నారు. స్వ‌తంత్ర వ్య‌క్తిత్వంతో యువ‌త ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్క‌పై ప్ర‌జ‌లు ఎందుకు స్పందించారు. ఇలా ఉంటే త‌ర్వ‌లో కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌కు అంద‌రం బానిస‌లం అవుతామ‌ని హెచ్చ‌రించారు. అంధ్ర అంటే అందరిది అన్నారు. ఆంధ్ర‌లు ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయంగా రాణిస్తున్నార‌ని, మూడు రాష్ట్రాల‌కు ఆంధ్ర‌లు సీఎంలుగా ఉన్నారు అని,, గ‌తంలో 8 రాష్ట్రాలకు ఆంధ్ర‌లు సీఎంలుగా ప‌నిచేశారు అనిగుర్తు చేశారు.

రాజ‌కీయాలు సామాజాన్ని శాసిస్తున్నాయ‌ని సీపీఎం నాయ‌కులు సీహెచ్ బాబు రావు అన్నారు. ప్ర‌జ‌ల జీవితాన్ని ప్ర‌భావితం చేస్తున్నాయి అన్నారు. రాజకీయ‌ల్లో కోటిశ్వ‌ర‌లే ఉన్నారు అని, హైటేక్ రాజ‌కీయ నేడు న‌డుతున్నాయి అన్నారు. దేశంలో రాష్ట్రంలో ధ‌న రాజ‌కీయాలు.. కొర్పొరేట్ అవినీతి రాజ్య‌మేలుతుందన్నారు. మ‌న దేశ అవినీతి శ్రీ‌లంక వ‌ర‌కు పాకింద‌న్నారు. దేశంలో గ్యాస్‌, పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డం.. విమానం పెట్రోల్ ధ‌ర త‌గ్గ‌డం దేనికి సంకేతం అన్నారు. యువ‌త రాజకీయ‌ల‌కు అతీతంగా పార్టీల‌కు అతీతంగా పోరాడాల‌ని, పౌర సామ‌జం పాత్ర కీల‌కం అని అన్నారు. పౌరులు సామాజం ర‌క‌ర‌కాల రూపాల్లో పోరాటం చేయ‌వ‌చ్చును అన్నారు. ఎక్క‌డ లేని విచిత్రాలు మ‌న రాష్ట్రంలో జ‌రుగుతాయ‌న్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలుగాని, ఎంపీలుగాని లేరు కాని రాష్ట్రంలో ఎంపి, ఎమ్మెల్యేల ఓట్లు  మాత్రం వారివే.. ఇదేమి విచిత్రం అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు పెట్టి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాలి. రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌కు  స‌మాధానం చెప్పాల‌న్నారు...
ప్రొపెసర్ ఉమా శ‌ర్మ మాట్లాడుతూ యువ‌త చేతిలో దేశ భ‌విష‌త్ ఉంద‌నారు. యువ‌త పోరాడాల‌ని, ప్ర‌శ్నించాల‌న్నారు. అనంత‌రం నిర్వ‌హ‌కులు అతిధుల‌ను స‌న్మానించారు.

ఆంధ్రవీర అనే యూత్ ఫోరమ్ ఆధ్వర్యంలో "రాష్ట్ర రాజకీయాలు - ఎదుర్కుంటున్న సవాళ్లు " "రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర " అనే అంశాలపై  చర్చా కార్యక్రమం జ‌రిగింది. ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వచందంగా నడిచేదే ఈ ఆంధ్రవీర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న అతి పెద్ద సామాజిక, ఆర్థిక సవాళ్లు వంటి అంశాల మీద చర్చించడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి దూరదూరాలనుంచి ఎంతో మంది పాల్గొన్నారు.

More Press Releases