Minister Talasani, K. Kavitha, MLC participated in Sri Ujjaini Mahankali Bonalu, Secunderabad

Minister Talasani, K. Kavitha, MLC participated in Sri Ujjaini Mahankali Bonalu, Secunderabad
పత్రికాప్రకటన

17.07.2022

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్ నగర్ని యోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్నుం డి MLC శ్రీమతి కవిత బంగారు బోనం ఎత్తుకొని మంత్రి తలసాని శ్రీనివాస్యా దవ్ దంపతులతో కలిసి మహంకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదయ్య నగర్క మాన్ నుండి మహంకాళి అమ్మవారి ఆలయం వరకు వందలాది మంది మహిళలు బోనాలతో వెంట రాగా, పోతురాజుల ఆటలు, కోలాటం బృందాల, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్ళతో MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత వెంట సాగారు. ఈ కార్యక్రమంలో MLA బేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

     
Talasani
K. Kavitha
Ujjaini Mahankali Bonalu

Watch Today's Deals on Amazon

More Press News