మైనారిటీల సంక్షేమం సముద్ధరణకు కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారు: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

  • మైనారిటీల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలిస్తున్నాం: మంత్రి కొప్పుల ఈశ్వర్
  • మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ: మంత్రి కొప్పుల ఈశ్వర్
  • అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: మైనారిటీల సంక్షేమం, సముద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి, ఉన్నతికి తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ ఇప్పటివరకు 9వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం చేయూతనివ్వాలని, బ్యాంకుల సహకారంతో సబ్సిడీపై మొత్తం 5వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించామన్నారు. ఇందుకుగాను 50కోట్లు కేటాయించినట్లు, అర్హులైన వారు ఆన్ లైన్ ( OBMMS) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మంత్రి ఈశ్వర్ కోరారు.

More Press Releases