Sunitha Laxma Reddy: మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి భాయి..

మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి భాయి కుటుంబాన్ని పరామర్శించిన సునీతా లక్ష్మారెడ్డి

మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి భాయి కుటుంబాన్ని పరామర్శించిన సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి భాయి భర్త కుమ్ర రాజు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారని దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కరీంనగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈశ్వరి భాయి కుటుంబాన్ని ఇద్రవెల్లి మండలంలోని వారి స్వగృహం నందు పరామర్శించారు. అనంతరం వారి భర్త పార్థివదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి భాయి గారి భర్త అకాల మరణం చాల బాధాకరం అని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ మరియు కమీషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్ , గద్ధల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు మరియు తదితరులు పాల్గొన్నారు.
Sunitha Laxma Reddy
Telangana

Watch Today's Deals on Amazon

More Press News