రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

Related image

హైదరాబాద్, జూలై 8: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు మరియు ఇతర రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌ లపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులలో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్నకలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు అన్ని సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిఏడి కార్యదర్శి వి.శేషాద్రి, IG, R&S రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, DPE సర్ఫరాజ్ అహ్మద్, డైరెక్టర్, LA, O/o CCLA రజత్ కుమార్ సైనీ, O/o CCLA ప్రత్యేక అధికారి సత్యశారద, MD-TSTS G.T.వెంకటేశ్వర్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases