సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్

Related image

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ మరియు గ్రీనరీ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచుటతో పాటుగా గోడలు అంచుల వెంబడి ఎత్తుగా పెరుగే మొక్కలు నాటాలని సంబందిత అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ నందలి జిమ్ బిల్డింగ్ కి పెయింటింగ్ వేయించి లోపల వేలాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేయాలని సూచించారు.

స్విమ్మింగ్ పూల్ నందు DO’s / Don’ts సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మరియు త్రాగునీటి కొరకు ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనుటతో పాటుగా ఎంట్రన్స్ గేటు వద్ద అడ్డంగా ఉన్న పోల్స్ తొలగించుటకు తగు చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు.

జీ.ఎస్ రాజు రోడ్ సెంట్రల్ డివైడర్ నందలి గ్రీనరీ అస్తవ్యస్తంగా ఉండుట గమనించి ట్రిమ్మింగ్ చేసి గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. జింఖానా గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మించుటకు అవసరమగు అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఉద్యానవన అధికారి శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases