విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా పని చేయాలి: వీఎంసీ కమిషనర్

విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా పని చేయాలి: వీఎంసీ కమిషనర్
విజయవాడ: నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం పటమట సర్కిల్-3 కార్యాలయం నందలి జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్ మరియు రెవెన్యూ విభాగముల కార్యాలయాలను తనిఖి చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు మరియు సిబ్బంది యొక్క పనితీరును పరిశీలించి విధి నిర్వహణ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయునట్లుగా చూడాలని అన్నారు.

ఈ సందర్బంలో కార్యాలయ ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన చోట్ల మొక్కలు అమర్చి పచ్చదనం పెంపొందించాలని మరియు ఆయా విభాగముల సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా సర్కిల్ కార్యాలయంలో సమీక్ష సమావేశములు నిర్వహించుకొనుటకు వీలుగా ఒక మీటింగ్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News