జమ్మూ మున్సిపల్ కార్పోరేషన్ ను సందర్శించిన విజయవాడ కార్పోరేటర్ల బృందం

జమ్మూ మున్సిపల్ కార్పోరేషన్ ను సందర్శించిన విజయవాడ కార్పోరేటర్ల బృందం
విజయవాడ: ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం జమ్మూ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయమును సందర్శించారు. ముందుగా బృంద సభ్యులు జమ్మూ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ చందర్ మోహన్ గుప్తా, డిప్యూటీ మేయర్ పూర్ణిమ శర్మ, చైర్మన్లు రాజ్ కుమార్, హర్దీప్ సింగ్, అజయ్ గుప్తా మరియు కమిషనర్ రాహుల్ యాదవ్ లను కలిశారు.

ఈ సందర్బంలో జమ్మూ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పలు కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరిస్తూ, ప్లాస్టిక్ లావో థైలీ లావో, వారసత్వ వ్యర్థాల బయో రెమిడియేషన్, ఆస్తి పన్ను వసూలు లేదు. జమ్మూకు కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే వస్తున్నాయిని, ప్రధాన ఆదాయం పర్యాటకం, బాస్మతి బియ్యం, బాదం వాల్‌నట్ పండ్లు ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవటం జరుగుతుందని కార్పోరేటర్ల బృందానికి వివరించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ల బృందమునకు సారద్యం వహిస్తున్న ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి లైజనింగ్ ఆఫీసర్ డా.ఏ.రవి చంద్, విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద అమలు చేస్తున్న సంస్కరణలు వాటిని అమలు చేస్తున్న విధానమును వారికీ వివరించారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News