సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి: వీఎంసీ కమిషనర్

సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి: వీఎంసీ కమిషనర్
  • సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ పరిశీలన
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలసి సోమవారం గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతున్న ఆధునికీకరణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ నందలి నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా అవసరమగు అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా పూల్ నందలి గ్రీనరి ఏర్పాటు పనులను పరిశీలిస్తూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఆకర్షణీయమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని మరియు పనులు పూర్తి అయిన వెనువెంటనే మిగిలిన డేబ్రిష్ మరియు వ్యర్ధములను అక్కడ నుండి తరలించి స్విమ్మింగ్ పూల్ ఆవరణం అంతయు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News