తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ  రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్‌ 2వ తేదీన రాష్ట్రం ఏర్పడిందని, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా గురువారం మహిళ కమీషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి జాతీయ పతాకావిష్క‌ర‌ణ చేసి గౌర‌వ వంద‌నం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్యమంలో అమరులకు నివాళులు అర్పించారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని, అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్ పర్సన్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యురాలు షాహిన్ ఆఫ్రొజ్, కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు:

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ గావించించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సునీల్ శర్మ, రామకృష్ణారావు, జీఏడీ కార్యదర్శి శేషాద్రిలతోపాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సచివాలయ అధికారులు సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ కు పోలీసులు గౌరవ వందనం గావించారు.

More Press Releases