ప్రధాని పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్షా సమావేశం

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్షా సమావేశం
హైదరాబాద్, మే 20: ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, 26 వ తేదీన ఐ.ఎస్.బి లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారని తెలిపారు. ఎన్.ఎస్.జి తో సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి SAM రిజ్వి, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, రాజ్‌భవన్‌ గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, అమయ్‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Somesh Kumar
Narendra Modi
Telangana

More Press News