Press Note and photos on 16.05.2022 - Mission Bhagiratha - Video Conference

Related image

వార్తా ప్రకటన   16-05-2022


         ఈ వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సరాఫరా సంతృప్తికర స్థాయిలోనే జరుగుతోందన్నారు మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి. వర్షాకాలం మొదలయ్యేవరకు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని ఇంజనీర్లు, అధికారులకు సూచించారు. తాగునీటి సరాఫరా పై అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈ,డి.ఈఈలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించిన ఈ.ఎన్.సి, నీటి సరాఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజలంతా మిషన్ భగీరథ నీటినే తాగేలా గ్రామాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆర్. ఓ ప్లాంట్ నీళ్లు తాగితే కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.మిషన్ భగీరథ నీటి నాణ్యత, స్వఛ్చతను ప్రజలకు వివరించాలన్నారు. త్వరలో ప్రారంభమయ్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో భగీరథ అధికారులు యాక్టీవ్ గా పాల్గొనాలని కోరారు.


 మిషన్ భగీరథ నిర్మాణాలు, ప్లాంట్ ల దగ్గర ఈ వర్షాకాలంలో 3,50,000 మొక్కలు నాటాలని భగీరథ అధికారులకు ఈ.ఎన్.సి  సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, శ్రీనివాస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
     

More Press Releases