తానా ‘తెలుగు తేజం పోటీలు' దరఖాస్తుకు గడువు పొడిగింపు

తానా  ‘తెలుగు తేజం పోటీలు' దరఖాస్తుకు  గడువు పొడిగింపు
"ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు వారు అందరికీ నమస్కారం!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాష పై మక్కువ ,పటిష్ఠత మరియు  అభిరుచి పెంచడం కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో  తెలుగు తేజం పోటీలు’ నిర్వహిస్తున్నాం.

ఈ పోటీల్లో ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చును. తల్లితండ్రులు మీ పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీలలో భాగస్వాములు చేయవలసిందిగా కోరుచున్నాము."

దరఖాస్తు ,  ప్రవేశ రుసుము మరియు నియమ నిబంధనలు కోసం ఈ క్రింది లంకెను క్లిక్ చేయండి:

https://forms.gle/u1gqzHFhTT3a6yYg9

దరఖాస్తు మరియు ప్రవేశరుసుము చెల్లించడానికి ఆఖరు తేది: మే 01, 2022.

జూన్ 4,5 తేదీలలో జూమ్ లో పోటీల నిర్వహణ.

మరిన్ని వివరాల కోసం, ఈ క్రింది ఫ్లైయర్స్ చూడండి: 

TANA
USA
NRI
Telugu

More Press News