శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి: వీఎంసీ కమిషనర్

శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి: వీఎంసీ కమిషనర్
విజయవాడ నగర ప్రజలకు మున్సిపల్ కమిషనర్ పి.రంజిత్ భాషా శుభకృత్ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని, తెలుగువారు సంప్రదాయంగా జరుపుకొను ఈ పండుగను భక్తితో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలి: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా నగర ప్రజలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో నగర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, సకల వృత్తులలో శుభాలు జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరాదిగా ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొను ఈ ఉగాది పండుగ వెళ్ళ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాల ఫలాలను లభ్దిదారుల అందించుటలో మరియు అన్ని రంగాలలో మన నగరాన్ని అభివృద్ధి పరచుకోనుటకు ప్రజలు సహకరించాలని అన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News