పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను అభినందించిన తెలంగాణ సీఎస్!

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను అభినందించిన తెలంగాణ సీఎస్!

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2019 లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మెరుగ్గా అమలు చేసి పెద్దపల్లి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచి సర్వోత్తమ జిల్లాగా జాతీయ అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ దేవసేనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు.

మహాత్మాగాంధీ 150వ జయంతి నాడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నది ఫ్రంట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతాహి దివస్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్ దేవసేన స్వీకరించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామంలో సర్వోత్తమ జిల్లాగా ఎంపిక కావడంతో పెద్దపల్లి జిల్లా బాధ్యత మరింత పెరిగిందని దేవసేన అన్నారు. 

SK Joshi
Devasena
Peddapalli District
Telangana

More Press News